
టాలీవుడ్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కోవై సరళ. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో హాస్య నటిగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం, తమిళంలో వడివేలుకు జంటగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బోలెడన్నీ పురస్కారాలు అందుకున్న ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. తెరపై నవ్వులు పంచిన ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆరో తరగతిలో ఉండగానే కోవై సరళ తన అభిమాన నటుడు ఎంజీఆర్ ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్ బయట నిల్చుంది. స్కూల్ డ్రెస్ లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎంజీఆర్ ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఇక విషయం తెలుసుకున్న ఎంజీఆర్ ఆమెను ఇంటికి పిలిచి మరీ ఆరా తీశారు. ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు ఆమమె చదువుతున్న సూక్ల్ కు ఫీజు పంపించాడు.