
కంపెనీ eMTB బైక్‌తో సిటీల్లో కూడా ఈజీగా తిరగొచ్చు ఈ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్ అమర్చారు సింగిల్ ఛార్జ్‌తో 85 మైళ్లు, 140కి.మీ వరకు రేంజ్ Kona El Kahuna Electric Bike : ఈ ఎలక్ట్రిక్ బైకు భలే ఉందిగా.. చూసేందుకు అచ్చం సైకిల్ లాగే ఉంది కదా.. ఇదో కొత్త ఎలక్ట్రిక్ బైకు అంట.. కోనా అనే కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ అందిస్తోంది. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ పేరుతో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైకును రిలీజ్ చేసింది. మౌంటెన్ బైక్ అయినా రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైకును సిటీలో తిప్పొచ్చు.. అలాగే కొండల ప్రాంతాల్లో కూడా ఈజీగా నడపవచ్చు. ఇందులో బాష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్, 625 Wh బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌పై 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే? : కోనా ఈఎల్ అనేది కహునా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్. దీని ధర 3,499 డాలర్లు (సుమారు రూ. 333,000 లక్షలు). కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా కొనేసుకోవచ్చు. కంపెనీ ఈ బైకును 4 సైజులలో అందిస్తోంది. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ (SM, M, L, XL) ఉన్నాయి. Read Also : Flipkart Freedom Sale 2026 : గేమర్లకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసర్ గేమింగ్ ల్యాప్‌టాప్ సగం ధరకే.. ఇలా కొంటే ఇంకా తక్కువ..! కహునా ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు : కోనా ఈఎల్ కహునా అనేది కంపెనీ eMTB బైక్. పట్టణ ప్రాంతాలలోనూ ఈజీగా వాడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ మోటార్‌ను అమర్చారు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడపగలదు