© 2026 nimisham.in

అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు అదనపు ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పంట సాగు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రైతులకు సరిపడా రుణాలు సులభంగా అందనున్నాయి.సకాలంలో చెల్లిస్తే మరిన్ని ప్రోత్సాహకాలురుణాలు సకాలంలో తిరిగి చెల్లించే నిబద్ధత గల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు (PRI) అందిస్తోంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద ఏకంగా రూ. 89,905.25 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 18,366.80 కోట్ల నిధులను కేటాయించి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్నిధుల పంపిణీ వివరాలుఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన నిధులు (రూ. కోట్లలో)2021-22 రూ. 21,476.93 కోట్లు2022-23 రూ. 17,997.88 కోట్లు2023-24 రూ. 14,251.92 కోట్లు2024-25 రూ. 17,811.72 కోట్లు2025-26 రూ. 18,366.80 కోట్లుమొత్తం (2021-22 నుంచి 2025-26 వరకు): రూ. 89,905.25 కోట్లుKisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:డిజిటల్ పద్ధతిలో జన్ సమర్థ్ ద్వారా కేసీసీల జారీరైతులకు కేసీసీ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జన్ సమర్థ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో
అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు అదనపు ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పంట సాగు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రైతులకు సరిపడా రుణాలు సులభంగా అందనున్నాయి.సకాలంలో చెల్లిస్తే మరిన్ని ప్రోత్సాహకాలురుణాలు సకాలంలో తిరిగి చెల్లించే నిబద్ధత గల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు (PRI) అందిస్తోంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద ఏకంగా రూ. 89,905.25 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 18,366.80 కోట్ల నిధులను కేటాయించి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్నిధుల పంపిణీ వివరాలుఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన నిధులు (రూ. కోట్లలో)2021-22 రూ. 21,476.93 కోట్లు2022-23 రూ. 17,997.88 కోట్లు2023-24 రూ. 14,251.92 కోట్లు2024-25 రూ. 17,811.72 కోట్లు2025-26 రూ. 18,366.80 కోట్లుమొత్తం (2021-22 నుంచి 2025-26 వరకు): రూ. 89,905.25 కోట్లుKisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:డిజిటల్ పద్ధతిలో జన్ సమర్థ్ ద్వారా కేసీసీల జారీరైతులకు కేసీసీ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జన్ సమర్థ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా, ఉత్తరప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఈ జాబితాలో చేరలేదని, త్వరలోనే డిజిటల్ సేవల విస్తరణపై స్పష్టత రానుందని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు.రైతులకు మరింత ఆర్థిక సహకారం లక్ష్యంకిసాన్ క్రెడిట్ కార్డు వ్యవస్థ ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో, సులభంగా రుణ సదుపాయం కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. సవరించిన వడ్డీ రాయితీ పథకం, సకాలంలో రుణం చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు వంటి చర్యల ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రైతులకు సంబంధించిన కేసీసీ రుణాలు, జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా కార్డుల జారీ, రుణ పరిమితి పెంపు వంటి కీలక అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా రైతుల ఆర్థిక అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు.