
కూసుమంచి: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయానికి ఎగువన, పాలేరు నది పరీవాహక ప్రాంతమైన వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం రాత్రి నుంచి 775 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం 20.90 అడుగులు ఉన్న జలాశయం నీటిమట్టం సోమవారం ఉదయం 8 గంటలకు 21.15 అడుగులకు చేరుకుంది. పాలేరు జలాశయం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ రెండు జోనుకు 1575 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, పాలేరు చిన్న కాలువకు 300 క్యూసెక్కుల నీటిని, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా మరో 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




