© 2026 nimisham.in

ఖజాగూడ హిట్ అండ్ రన్

నిందితుడి లైసెన్స్ రద్దు ప్రతిపాదన

రాయదుర్గం పోలీసుల కఠిన చర్యలు

Khajaguda Hit And Run Case: హైదరాబాద్‌లోని ఖజాగూడ-నానక్‌రామ్‌గూడ రహదారిపై జరిగిన హిట్ అండ్ రన్ ఘటన సైబరాబాద్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆగస్టు 31న తెల్లవారుజామున రాయదుర్గం వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన నంద కిషోర్ కుమార్ రే అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రథమ ప్రమాదంలో గాయపడిన బాధితుడికి సాయం చేసేందుకు యత్నించిన సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వారిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.

Top scholarships 2026 : విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్.. నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేయడానికి చేసుకోండి!

నంబర్ ప్లేట్ లేని కారుతో ప్రమాదం:

హిట్ అండ్ రన్(Khajaguda Hit And Run Case)కు పాల్పడిన కారును 23 ఏళ్ల బి. శివ సందీప్ సాయి ఆనంద్‌కు చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ వాహనంగా రాయదుర్గం పోలీసులు గుర్తించారు. వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, వాహన చాసిస్, ఇంజిన్ నంబర్లను క్షుణ్ణంగా విశ్లేషించి సెప్టెంబర్ 1న వాహనాన్ని స్వాధీనం చేసుకుని సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి రక్త నమూనాల ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు ఆర్టీఏకు లేఖ:

ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, నిందితుడు శివ సందీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. ఒకరి మృతికి కారణమై, గాయపడిన వారికి సాయం చేయకుండా పారిపోవడమే కాకుండా నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని నడపడంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.