© 2026 nimisham.in

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Siya goyal married Chetan four months ago: పూణే బిజినెస్ మెన్ కేతన్ అగర్వాల్ మార్డర్ కేసులో ట్విస్ట్ ల ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 18న జరిగిన లోహగఢ్ కోట హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యంగా పూణె కోర్టు ఇటివల మరోసారి సియా గోయల్, చేతన్ చౌదరీలకు రిమాండ్ జులై 26 వరకు పొడిగించింది. ముఖ్యంగా పోలీసులు టెక్నికల్ ఆధారాలు, డిలిట్ వాట్సాప్ డాటా రికవరీపై ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సియా గోయల్ వాట్సాప్ నుంచి అనేక అంశాలు , చాట్ లు ప్రస్తుతం పోలీసులు చేతికి చిక్కాయి. దీనిలో ఇప్పటికే సియాగోయల్ జరగని పెళ్లికి ఆధార్ కార్డు పిక్స్ పంపాలని తన ఫ్రెండ్ తో చేసిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సియా గోయల్, చేతన్ చౌదరీల పెళ్లి మర్డర్ కు ముందే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సియా వాట్సాప్ చాట్ లో దీనికి సంబంధించిన కీలక విషయాలు పోలీసులు చేతికి చిక్కాయి. కేతన్ అగర్వాల్ తో నిశ్చితార్థం తర్వాత చేతన్ చౌదరీతో సియాగోయల్ సీక్రెట్ గా పెళ్లి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు నిజంగా వివాహం చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి, ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ ధృవీకరణ పత్రం ఏమైనా ఉందా..?.. లేదో పోలీసులు విచారణ చేపట్టారు. ఒక వేళ ఈ పెళ్లి జరిగినట్లు తెలితే మాత్రం.. కేతన్ అగర్వాల్‌తో ఆమె ఫిబ్రవరిలో
జరిగిన నిశ్చితార్థం చెల్లదని వాదనలు వస్తున్నాయి.
Read more: Ketan Grand father: అయ్యో.. ఎంత పని చేశావ్ సియా..?.. కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం.!.
అంతేకాకుండా.. సియా, చేతన్ ల పెళ్లి జరిగినప్పుడు.. సాక్షులుగా సంతకాలు చేశారని సియా స్నేహితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రస్తుతం విచారిస్తున్నామని పూణె పోలీసులు తెలిపారు. నిందితులైన జంట పెళ్లి దండలు ధరించి ఉన్నట్లుగా చూపిస్తున్నాయని చెబుతున్న, ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలుత పోస్ట్ లు చేశారు.
ఆ తర్వాత డిలిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ డిలిట్ ఫోటోల్ని రికవరీ చేసేందుకు సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకొవచ్చు. మరోవైపు సియా గోయల్ ను మిడిల్ ఫింగర్ వివాదంలో ఆమె తండ్రి సపోర్ట్ చేస్తు వీడియోను రిలీజ్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.