
హవీష్, హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. హవీష్ (Havish), హాట్ బ్యూటీ కావ్య థాఫర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను రెడీ’ (Nenu Ready). ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. వరంగల్‌లో జరిగిన ఈ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, దర్శకుడు త్రినాధరావుకు స్టేజ్‌పైనే ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే.. పాట విడుదల అనంతరం వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న హీరోయిన్ కావ్య థాఫర్, చిత్ర యూనిట్‌తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్ త్రినాధరావు నక్కినను ఉద్దేశించి ‘ఐ లవ్ యూ సర్’ అని పబ్లిగ్గా స్టేజ్‌పై చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘‘ఈ ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి కారణం త్రినాధరావు నక్కిన. ఆయనే ఈ సినిమాకి అసలైన బ్యాక్‌బోన్. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ప్రతీ డిపార్ట్మెంట్ని దగ్గరుండి చూసుకున్న ఆల్‌రౌండర్ ఆయన. మీ సినిమాలో హీరోయిన్గా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయనపై కావ్య ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో తన పాత్రను పరిచయం చేస్తూ, తాను తెలంగాణ యాస మాట్లాడే పక్కా మాస్ అమ్మాయి పాత్రలో కనిపిస్తున్నట్లు కావ్య వెల్లడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నమైనదని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్