
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : కర్ణాటకలో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. గత ఏడు నెలల్లో ప్రజల నుంచి రూ.558 కోట్లను ఈ నేరగాళ్లు కొట్టివేశారు. ఫిర్యాదుల అనంతరం బాధితులకు చేరింది రూ.1.9 కోట్లు మాత్రమే. వంచన జరిగిన వెంటనే ఫిర్యాదులు చేయడంతో రూ.35.9 కోట్ల నగదును ఫ్రీజ్ చేయగలిగినా, దాన్ని బాధితుల ఖాతాలకు మళ్లించడంలో జాప్యం జరుగుతోంది. భారతదేశానికి సిలికాన్ వ్యాలీగా బెంగళూరుకు గుర్తింపు ఉన్నప్పటికీ పోలీసుల వద్ద సైబర్ నిపుణుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ కేసుల దర్యాప్తు మందగతిన నడుస్తోంది. బెంగళూరు నగర పోలీసు కమిషనర్లోని సైబర్ ఠాణాలో 200 పోస్టులతో కలిపి నగర వ్యాప్తంగా 320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 2024లో 17,890 కేసులు నమోదు కాగా, రూ.1841 కోట్లను ప్రజలు పోగొట్టుకున్నారు. అందులో రూ.183.6 కోట్లను మాత్రమే బాధితులకు తిరిగి అందించగలిగారు. గత ఏడాది 10,703 కేసులు నమోదు కాగా, రూ.1,756.6 కోట్లను ప్రజలు పోగొట్టుకోగా, రూ.158.5 కోట్లను మాత్రమే రికవరీ చేసి బాధితులకు అందించచగలిగారు. ఈ ఏడాది నమోదైన కేసులు తక్కువగానే ఉన్నాయి. ప్రజల్లో జాగృతి రావడమే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు