
సింధనూరు: మల్లదగుడ్డ క్యాంపులో శుక్రవారం మధ్యాహ్నం ఓ రోడ్డు ప్రమాదంలో రహదారి పక్కన పడిపోయి కొనఊపిరితో ఉన్న ఓ యువకుడిని హుటాహుటిన తన వాహనంలో సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి.. మస్కి ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ మానవత్వం చాటుకున్నారు. సింధనూరు మూడో మైలు క్యాంపు నుంచి ఉమ్లుట్టి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేశ్.. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా టీవీఎస్ వాహనంపై వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టాడు. వృద్ధునికి చిన్న గాయాలే తగిలినా మహేశ్ రోడ్డు పక్క రాళ్లపై పడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. సింధనూరు, తుర్విహాళ రెండు ఆసుపత్రుల్లోనూ వాహనాలు సిద్ధంగా లేవు. అదే సమయంలో తుర్విహాళ నుంచి సింధనూరు వెళుతున్న మస్కి ఎమ్మెల్యే బసనగౌడ విషయం తెలుసుకుని వెంటనే ఆ యువకుడిని తన వాహనంలోకి ఎక్కించి సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.