
బెంగళూరు క్రీడలు: కర్ణాటకలోని నంది హిల్స్‌లో చేపట్టిన మాన్సూన్ మారథాన్ పరుగు పందెంలో విషాదం చోటుచేసుకుంది. మారథాన్‌లో పాల్గొన్న అథ్లెట్ ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్ జగదే (31)గా గుర్తించారు. 21 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్న అమన్‌దీప్ గిరిధాములోని ఒక కొండపై కుప్పకూలాడు. అతడిని వెంటనే ముద్దేనహళ్లిలోని శ్రీమధుసూదన్ సాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్నేళ్ల నుంచి బెంగళూరులో ఉంటున్న అమన్.. ఓ టెక్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.