
బెంగళూరు(క్రీడలు): దేశవ్యాప్తంగా గణేశ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఏనుగులకు ప్యాలెస్‌ ఆవరణ ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుడు ప్రహ్లాదరావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఏనుగుల పాదాలను కడిగి పసుపు, కుంకుమ పూసి, చెరకు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖతోపాటు పలువురు అధికారులు, రాజభవనం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సారి దసరా ఉత్సవాల్లో కంబల క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ క్రీడలను 8 వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





