
మల్యాల: మల్యాలలోని మండల పరిషత్ సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. వేముల గీతిక అనే మహిళ సమీపంలోని ఆలయంలో వరలక్ష్మీ వ్రతం చేసేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళంతో పాటు బీరువాను పగులగొట్టి అందులోని 3 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సందీప్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.