
కరీంనగర్ టౌన్(ఈటీవీ): నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో భాజపాకు సంబంధం ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వాఖ్యలు చేయడం దురదృష్టకరమని మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఎక్కడ దాడులు జరిగినా పార్టీలకతీతంగా ఉండి సద్దుమణిగే ప్రయత్నం చేయాలి తప్ప భాజపాను విమర్శించడం మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో ఎక్కడ గొడవలు జరగలేదా? అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ప్రశ్నించారు. కిసాన్ నగర్లో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని రాజకీయం చేయడం తగదని అని సునీల్ రావు హెచ్చరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.