
జాతీయస్థాయిలో రాణిస్తున్న ఆర్చరీ క్రీడాకారులు న్యూస్‌టుడే, కరీంనగర్ కొత్తపల్లి విల్లు ఎక్కుపెట్టి, ఏకాగ్రతతో బాణాన్ని సంధించి, గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తూ పతకాల పంట పండిస్తున్నారు జిల్లా క్రీడాకారులు. చిన్ననాటి నుంచి విలువిద్యపై ఆసక్తి పెంచుకుని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనుకున్న రంగంలో రాణిస్తున్నారు. మానసిక ఏకాగ్రత, సహనం, పట్టుదలతో లక్ష్యాన్ని ఛేదించి ఆర్చరీలో ప్రతిభ చాటుతున్నారు. కరీంనగర్‌కు చెందిన రమేష్-తిరుమల కుమార్తె నాంపల్లి విన్మయి ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. 2026 మే నెలలో గోవాలో జరిగిన ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. 2026 ఆంధప్రదేశ్ గుంటూరులో జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో సత్తా చాటింది. కరీంనగర్‌కు చెందిన శ్రీధర్-మమత కుమార్తె గండికి శ్రీమయిరెడ్డి ఎల్ఎండీ కాలనీలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది. 2026 ఏప్రిల్‌లో విజయవాడలో జరిగిన కేవీ రీజినల్ ఆటల పోటీల్లో ఆర్చరీ విభాగం అండర్-17లో బంగారు పతకం సాధించి 2026 ఆగస్టు 19న దిల్లీలో జరిగే కేవీ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు