
మంథని గ్రామీణం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ శ్రేణులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని రూ. 51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ఈ పథకాలను దశలవారీగా రూ. 1,00,116కు పెంచారని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయన్నారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి పథకాలను కొనసాగించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మంథని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.