© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య విరాళాల్లో దుర్వినియోగానికి (Ram Temple theft case) పాల్పడిన వారిని భాజపా (BJP), ఆరెస్సెస్‌లు కలిసి కాపాడుతున్నాయని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తిప్పి కొట్టారు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతికేంచిన పార్టీ.. ఇప్పుడు అదే అంశంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి గురించి దేశప్రజలందరికీ తెలుసన్నారు. శతాబ్దాల తరబడి సాగిన పోరాటం..భక్తి ఫలితంగానే రామమందిర నిర్మాణం సాధ్యమైందని కంగన పేర్కొన్నారు. సనాతన సంస్కృతి, విశ్వాసం, దేశ వారసత్వాన్ని పరిరక్షించడానికి భాజపా ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. తమ పార్టీ ప్రజల విశ్వాసాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు సాధనంగా వాడుకోలేదన్నారు. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ (Congress) పార్టీ స్వప్రయోజనాల కోసం మతాలను సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. రామమందిరం వంటి పవిత్రమైన అంశాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.