
Kangana Ranaut Slams Baba Ramdev For Remarks On Her Bedroom And Character
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తన 'జనరేషన్ గటర్' వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ చేసిన విమర్శలకు కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా బదులిచ్చారు.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తన 'జనరేషన్ గటర్' వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ చేసిన విమర్శలకు కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా బదులిచ్చారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌దేవ్ మాట్లాడుతూ.. యువతను 'గటర్' అని పిలవడం వక్రబుద్ధికి నిదర్శనమని అన్నారు. కంగన చిన్నతనం, యవ్వనం, ఆమె గతం ఎలాంటివో తనకు తెలుసంటూ ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ "బాబాజీ, నా యవ్వనం లేదా నా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దు. పుకార్ల ఆధారంగా మాట్లాడటం కాదు. కనీసం మోసపూరిత ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మీపై చీవాట్లు పెట్టినట్టు నాపై ఎప్పుడూ పెట్టలేదు. మీ కంటే నా క్యారెక్టర్ ఎంతో ఉత్తమమైనది. ఇక్కడ ఎలాంటి మోసం లేదు. కాబట్టి నాకు క్యారెక్టర్ పాఠాలు చెప్పొద్దు" అని తీవ్రంగా స్పందించారు. పతంజలి తప్పుడు ప్రకటనల కేసులో 2024లో సుప్రీంకోర్టు రామ్‌దేవ్‌ను మందలించిన విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేశారు.గత నెలలో కొందరు నిరసనకారులను ఉద్దేశించి కంగనా 'జనరేషన్ గటర్' అని వ్యాఖ్యానించడం ఈ వివాదానికి దారితీసింది. అయితే, తన వ్యాఖ్యలు మొత్తం యువతకు కాదని, కేవలం కొందరి ప్రవర్తనను మాత్రమే విమర్శించానని ఆ తర్వాత ఆమె స్పష్టతనిచ్చారు.






