
ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు హీరోని మించి ఉండేవి కావు. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు హీరోని మించి ఉండేవి కావు. ఎప్పుడో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే హీరోయిన్ బేస్డ్గా వచ్చేవి. కానీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ తమదైన నటనతో కథను తమ భుజాలపై మోసి.. ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ‘అగధ’ (Agadha)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధమైన ‘అగధ’ చిత్రంలో కామాక్షి భాస్కర్ల మహాదేవి అనే పాత్రలో ప్రధాన పాత్రను పోషించారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కామాక్షి చేసిన పాత్రలతో పోలిస్తే మహాదేవి పాత్ర పూర్తిగా భిన్నమైనదిగా కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె కనిపించనుండటం ఈ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు ఈ తరహా చిత్రాలు అంటే ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాలు కామాక్షి భాస్కర్లకు ఎలాంటి సక్సెస్‌ని ఇచ్చాయో తెలియంది కాదు. ఇప్పుడలాంటి మిస్టరీ థ్రిల్లర్ జానర్లోనే ఇప్పుడు ‘అగధ’ రాబోతోంది. కచ్చితంగా కామాక్షికి మరో బంపర్ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల విషయానికి వస్తే.. ఆమె మొదటి నుంచి ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, నటిగా విభిన్నమైన భావోద్వేగ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ‘అగధ’లోని మహాదేవి పాత్ర కూడా తన జర్నీలో మరో ముఖ్యమైన మెట్టుగా నిలిచే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ‘అగధ’పై