© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Kaleshwaram Latest News: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రవహించే పెన్ గంగాతో పాటు ప్రాణహిత నదులు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఊరకలు వేస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 95 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనితో అప్రమత్తమై మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సంబంధించిన 85 గేట్లను పూర్తిగా పైకి లేపి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదిలో గోదావరి నది ఇలా పరవళ్లు తొక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. స్థానికంగా లేని వానలు.. వాస్తవానికి తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్దగా వర్షాలు కురవడం లేదు.. అయినప్పటికీ, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుంభవృష్టి వల్లే ప్రాణహిత నది ద్వారా కాళేశ్వరం వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంతో కాళేశ్వరం క్షేత్రం వద్ద గోదారమ్మ సవ్వడి చేస్తూ.. ప్రకృతి ప్రేమికులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కౌటాల వద్ద పుష్కర ఘాట్లను తాకిన నీరు.. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిర్పూర్ నియోజకవర్గంలో వరద భీభత్సం కనిపిస్తోంది. ఇక్కడి ప్రాణహిత.. పెన్ గంగా
నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండగా.. తాటిపెల్లి వద్ద పెన్ గంగా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.
Read more: Kalvakuntla Kavitha: న్యాయ పోరాటం చేస్తాం.!. ఎన్నికల సంఘం పేరుమార్పు నోటిసులపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
అధికారుల హెచ్చరిక.. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలతో పాటు మత్స్యకారులు ఎవరూ కూడా నదులను దాటే ప్రయత్నం చేయవదని.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది.. సిర్పూర్ మండలంలోని చీలపల్లి వద్ద వరద నీటి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.