© 2026 nimisham.in

‘8 వసంతాలు’ తర్వాత తన దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చినప్పటికీ ఏవీ తనను ఎగ్జైట్ చేయలేదని, ‘రోమాంచకం’ (Romanchakam) కథ విన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందని హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ (Ananthika Sanilkumar) తెలిపారు. ఈ చిత్ర విశేషాలను ఇంటర్వ్యూలో తెలిపారు అనంతిక సనిల్ కుమార్. ‘8 వసంతాలు’ తర్వాత నా దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. ఎన్నో కథలు విన్నాను. కానీ అవేవీ నన్ను ఎగ్జైట్ చేయలేదు. ఆ సమయంలో ‘రోమాంచకం’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సినిమాలో కదా నటించాలని అనుకున్నాను అనే ఫీల్ కలిగింది. ఇందులో నేను బబ్లీగా, సరదాగా ఉండే అమ్మాయి పాత్రలో నటించాను. ఇలాంటి క్యారెక్టర్లో నటించాలనేది నా డ్రీమ్. యూత్ ఆడియెన్స్ బాగా రిలేట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో నేను తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ తరం యువత జీవితాల్లో జరిగే చాలా కాంటెంపరరీ అంశాలను సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఇది ప్రేమకథే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సుమంత్ ప్రభాస్ ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వర్క్‌షాప్ చేశాడు. నేను మాత్రం ఆయనతో పోలిస్తే తక్కువ వర్క్‌షాప్స్ చేశాను. ఆయన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ను కూడా ఆయనతో పోటీ పడేలా డిజైన్ చేశారు. మా ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు చాలా లైవ్లీగా, నిజంగా ఒక జంట మధ్య జరుగుతున్నట్టుగా సహజంగా అనిపిస్తాయి. సీన్స్ ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగంగా సాగుతూ ఎంటర్టైన్ చేస్తాయి. ‘8 వసంతాలు’తో పోలిస్తే ‘రోమాంచకం’ పూర్తిగా డిఫరెంట్ జానర్ మూవీ. ‘8 వసంతాలు’ లాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేయాలని అనుకున్నాను. అదే సమయంలో ప్రేమకథల్లో కూడా నటించాలని ఉండేది. ‘రోమాంచకం’ షూటింగ్ కూడా సినిమాలో ఉన్నంత సరదాగా జరిగింది
. ఈ రెండు సినిమాల అనుభవం నాకెంతో ప్రత్యేకమైనది. ఇందులో ‘రాధారమణ’ నా ఫేవరేట్ సాంగ్.
కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది
ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. కొన్నిసార్లు నటిస్తున్నప్పుడే మనలో ఒక హ్యాపీనెస్ కలుగుతుంది. ఆ జాయ్‌ను ఫీల్ అవుతాం. అలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. నా పెర్ఫార్మెన్స్ చూసి సందీప్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
సుమంత్ ప్రభాస్‌ను తొలిసారి ఆఫీస్‌లో కలిసినప్పుడు బాగా మాట్లాడుకున్నాం. అప్పుడే ఒక ఫ్రెండ్ అనే ఫీల్ కలిగింది. కొన్ని లెంగ్తీ సీన్స్‌కు కలిసి రిహార్సల్స్ చేశాం. దాంతో మా మధ్య మంచి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఏర్పడింది.
ప్రస్తుతం తమిళంతో పాటు మలయాళం, తెలుగులో కూడా నటిస్తున్నాను. అవకాశాలను బట్టి సినిమాలను అంగీకరిస్తున్నాను. ఏ భాషను ఇగ్నోర్ చేయడం లేదు. ఎక్కడ మంచి అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేస్తున్నాను.
‘8 వసంతాలు’లో హీరోయిన్గా నాకు మంచి పేరు వచ్చింది. ‘రోమాంచకం’లో నాతో పాటు హీరోకు కూడా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. అయితే ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. నటిగా కొత్త తరహా పాత్రలు, సినిమాలు, విభిన్న జానర్స్ చేయాలని ఉంది. డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ పాత్ర చేసినా అందులో నటిస్తున్నప్పుడు నాకు సంతృప్తి కలగాలి. ఆ క్యారెక్టర్ నాకు ఆనందాన్ని ఇవ్వాలి.