© 2026 nimisham.in
అక్కినేని వారసుడు అఖిల్ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. సినిమా కోసం అతడు శాయశక్తులా కష్టపడుతున్నప్పటికీ, సరైన సక్సెస్ రావడం లేదని భావిస్తున్నారు. అందుకే ఈసారి 'లెనిన్' సినిమాతో హిట్టు కొట్టి, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని ఆశిస్తున్నారు. తమ వంతుగా సినిమాకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, నాని లాంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రానికి సపోర్ట్ అందించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అఖిల్ కోసం రంగంలోకి దిగారు. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘లెనిన్’ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ కూడా యాడ్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.* ‘మీకు నా మొహం చూపించలేకపోతున్నా’.. అఖిల్ ఎమోషనల్‘లెనిన్’ మూవీలో తారక్ భాగం అవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. ''దృఢ సంకల్పంతో ఆవిర్భవించిన ప్రపంచం ఇది. పరిచయం అవసరం లేని ఆ గొంతుకతోనే దీన్ని పరిచయం చేస్తున్నారు. 'లెనిన్' ఆరంభంలో శ్రీరామపురం, భారతం మిట్టలను పరిచయం చేయడానికి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన వాయిస్ అందించారు'' అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తారక్ - అఖిల్ - మురళీ కిషోర్ కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం, అఖిల్ ను గట్టిగా హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫోటోలను మనం చూడొచ్చు.*
‘లెనిన్’లో ట్విస్టులు ఎవరూ ఊహించలేరు.. జూలై 10న వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు: నాగార్జున‘లెనిన్’ స్టోరీ ఎన్టీఆర్ వాయిస్ తోనే ప్రారంభం కానుంది. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాలు.. అందులోని ప్రధాన పాత్రల తీరు తెన్నులను ఆయన వివరిస్తారన్నమాట. తన సినిమాకి సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ కు అఖిల్ ధన్యవాదాలు తెలిపారు. ''థ్యాంక్యూ టైగర్. 'లెనిన్' కోసం గర్జించినందుకు కృతజ్ఞతలు. ఎప్పటికీ మర్చిపోలేనంత ప్రేమను ఇచ్చావు. లవ్ యూ బ్రదర్'' అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. గతంలో అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు తారక్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే.‘లెనిన్’ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.