
‘లుంగీవాలా’ వ్యాఖ్యపై రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ తనపై ఓ మహిళా సభ్యురాలు అనుచిత వ్యాఖ్య చేశారని సభ దృష్టికి తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల సభ్యుల నినాదాలతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. బ్రిటాస్ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ లుంగీవాలాగా సంబోధించినట్లు సమాచారం.బ్రిటాస్ అభ్యంతరంఅత్యవసర ప్రజా ప్రాధాన్య అంశాలను ప్రస్తావించే సమయంలో బ్రిటాస్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఓ మహిళా సభ్యురాలు తనను ‘లుంగీవాలా’ అని సంబోధించారని చెప్పారు. ఇది తనను, తన సంస్కృతిని అవమానించడమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది.‘అందరూ భారతీయులే’సభలో ప్రతి సభ్యుడూ సమానమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. “మనమంతా భారతీయులమే” అని పేర్కొన్నారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్య ఏదైనా ఉంటే సంబంధిత సభ్యులను ఛైర్మన్ ఛాంబర్‌కు పిలిచి మాట్లాడాలని సూచించారు.ఛైర్మన్ రాధాకృష్ణన్ కూడా సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. “మన సంస్కృతి ప్రత్యేకమైనది. సంస్కృతి, గుర్తింపు, మతాన్ని అగౌరవపరచకూడదు. సంబంధిత సభ్యురాలిని నా ఛాంబర్‌కు పిలిచి సమస్యను పరిష్కరిస్తాను” అని చెప్పారు.‘అది లుంగీ కాదు.. ధోతి’అయినా సభలో గందరగోళం కొనసాగింది. సభా నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, సంబంధిత వస్త్రాన్ని ‘లుంగీ’గా కాకుండా ‘ధోతి’గా పేర్కొన్నారు. మరోవైపు సుష్మితా దేవ్ వాదనను కూడా రికార్డులోకి తీసుకోవాలని చెప్పారు. ఇరువైపులా నినాదాలు కొనసాగడంతో ఛైర్మన్