
జార్ఖండ్ లో ఇవాళ అసెంబ్లీ మార్చ్ చేపట్టిన విద్యార్దులపై (Jhakhand Student Protest)పోలీసులు బలప్రయోగం చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న విద్యార్ధులు ఇవాళ అసెంబ్లీ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసుల తరహాలోనే జార్ఖండ్ పోలీసులు బలప్రయోగానికి దిగారు. లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగాలు, వాటర్ క్యానన్లతో వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అయినా కొందరు విద్యార్ధులు అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకెళ్లిపోయారు. దీంతో ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.Rahul Gandhi: స్వాతంత్ర దిన వేడుకల్లో రాహుల్ సీటు అక్కడే..! కేంద్రం క్లారిటీ..!నిరసనలకు దిగుతున్న విద్యార్ధులతో నిన్న చర్చలు జరిపిన జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ సర్కార్.. పలు కీలక హామీలు కూడా ఇచ్చింది. అయినా విద్యార్ధులు తమ డిమాండ్లు నెరవేరే వరకూ విశ్రమించేది లేదంటూ ఇవాళ ర్యాలీ చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేసినా లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఢిల్లీ నిరసనల తరహాలో స్పందించలేదంటూ బీజేపీ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందించారు. Amit Shah: ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అమిత్ షా..! ఒత్తిడికి తలొగ్గి కీలక నిర్ణయం..!జార్ఖండ్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పని రాహుల్ గాంధీ తేల్చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు. జార్ఖండ్ ప్రభుత్వం ఆ విద్యార్థుల మాటలను వినడం కొనసాగించాలి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాహుల్ సూచించారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి