
వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” (January 12 Vidudala) అనే పేరుని ఖరారు చేశారు. పేరుతో పాటు విడుదల తేదీ కూడా అదే ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అనిల్ రావిపూడి స్టయిల్. అతని ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా రెండో పాట మొత్తం నలుగురు హీరో, హీరోయిన్లతో చిత్రకరిస్తున్నారు. మైసూర్ దగ్గర్లోని మేల్కొటిలో ఒక సెలెబ్రేషన్ సాంగ్ తీస్తున్నారు. హీరోలు ఇద్దరూ బైక్ పై వెళ్తుంటే వారితో హీరోయిన్లు పాల్గొనే గ్రామీణ నేపథ్యపు పాటని అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే 40 రోజులకి పైగా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో నలభై రోజుల్లో మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారట. అంత స్పీడ్ అనిల్ రావిపూడిది. మరోవైపు, ఎప్పుడో మొదలుపెట్టిన “ఆదర్శ కుటుంబం” సినిమాని మాత్రం త్రివిక్రమ్ పూర్తి చెయ్యలేకపోయారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వెంకటేష్ ఈ నెలలో పూర్తి చేస్తారట. ‘జనవరి 12 విడుదల’ పాట చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి వచ్చి అది కంప్లీట్ చేస్తారు
.