
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా'. ఈ ఇద్దరి కలయిక అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్లో అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో సంచలన వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు, వారి పాత్రల గురించి బయటకొస్తున్న లీక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర గురించిన అప్డేట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అట్లీ సినిమా అంటేనే బిగ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. ఇక అల్లు అర్జున్‌తో ఆయన జతకడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క కథానాయిక కాకుండా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరొకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇందులో జాన్వీ కపూర్ పాత్రపై ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఒక శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో కనిపించబోతోందట