
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో టీడీపీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) కలిసి ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రస్తుతం అధికారంలో ఉంది. 2024 ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసి పనిచేయడంతో కూటమికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా స్థానిక స్థాయిలో కొన్ని సందర్భాల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడుతూనే ఉన్నాయి. అధినేతలు మాత్రం ఇలాంటి సమస్యలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు సాగాలని పదేపదే సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ (Pantham Nanaji) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. టీడీపీకి కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టారా? అంటూ ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావం వెనుక ఉన్న లక్ష్యం వేరని, పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ పార్టీ కార్యకర్తల ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఎలాంటి రాజకీయ ఉచ్చుల్లో పడకుండా జనసైనికులు సంయమనం పాటించాలని కూడా సూచించారు. నానాజీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. కొందరు జనసేన కార్యకర్తలు ఆయన మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమైన సమయంలో బహిరంగ విమర్శలు కూటమి ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాలు ఇప్పటికే తమ పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవద్దని స్పష్టమైన సూచనలు చేశాయి. కూటమి ఐక్యతను కాపాడుకోవాలని, చిన్నచిన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అధినేతలు చెబుతున్నారు. వైసీపీ (YSR Congress Party)కి కూటమిలోని విభేదాలను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదన్నదే వారి ప్రధాన