TCS Laptop Monitoring : మార్కెట్ విలువ పరంగా చూస్తే భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక ప్రకటన చేసింది. తాము ఉద్యోగుల వ్యక్తిగత యాక్టివిటీని ట్రాక్ చేయట్లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ల్యాప్‌టాప్స్‌లో కొన్ని మానిటరింగ్ టూల్స్ ఏర్పాటు చేసి, ఉద్యోగుల పనితీరు, ఇతర కార్యకలాపాలపై నిఘా పెట్టిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పలు ఆంగ్ల మీడియాల్లో దీనిపై కథనాలు వచ్చాయి. ఇటీవల విస్తృత చర్చకు దారితీశాయి. ఉద్యోగులు ఏయే అప్లికేషన్లు ఉపయోగిస్తున్నారు? వాటిపై ఎంత సమయం గడుపుతున్నారు వంటి పలు వివరాల్ని ఈ టూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల ప్రైవసీ గురించి ప్రశ్నలు తలెత్తాయి.ఈ ఆరోపణలపై తాజాగా స్పందించిన టీసీఎస్ అవన్నీ నిరాధారమైనవని ఖండించింది. తాము ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాల్ని ట్రాక్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు TCS మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుందంటూ వచ్చిన వార్తలు నిరాధారమైనవి, అవాస్తవమైనవని కంపెనీ పేర్కొంది.టీసీఎస్ వివరాల ప్రకారం- ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే డిజిటల్ టూల్స్ ముఖ్యంగా నెట్వర్క్ పనితీరును పర్యవేక్షించేందుకు, సిస్టమ్స్ భద్రత కోసం, ఉద్యోగులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు ఉపయోగిస్తారు. ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాల్ని (యాక్టివిటీని) ట్రాక్ చేయడం తమ ఉద్దేశం కాదని టీసీఎస్ స్పష్టం చేసింది. ఉద్యోగుల గోప్యతను తాము గౌరవిస్తామని తెలిపింది.ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అలర్ట్.. ఇంట్లో విద్యుత్ లెక్కలు చెప్పాలని కంపెనీ మెయిల్.. అసలు కారణమిదేమానిటరింగ్ టూల్స్ ఏం చేస్తాయి?సాధారణంగా పెద్ద పెద్ద సంస్థలు తమ కంప్యూటర్ నెట్వర్క్, అప్లికేషన్స్, పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు డిజిటల్ మానిటరింగ్ టూల్స్ ఉపయోగిస్తాయి. ఉదాహరణకు నెట్‌వర్క్‌లో సమస్య ఎక్కడ వస్తుంది? ఏమైనా అప్లికేషన్ సరిగా పనిచేయట్లేదా?, సిస్టమ్ పనితీరులో ఏమైనా ఇబ్బందులున్నాయా? వంటి విషయాల్ని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇంకా సైబర్ దాడులు, అనుమానాస్పద నెట్వర్క్ కార్యకలాపాలు, డేటా