© 2026 nimisham.in

దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అక్కడి కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే కఠినమైన సవాళ్లను వివరిస్తూ, ఉద్యోగం కోసం కొరియాకు రావద్దని ఆమె సూచించింది. స్వర్ణిమ్ సింగ్ అనే ఈ యువతి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంది.కొరియాలోని కంపెనీలలో పని గంటలు ముగిసినా, ఆలస్యంగా ఇంటికి వెళ్లాలనే నిబంధన ఉంటుందని స్వర్ణిమ్ తెలిపింది. అలా ఎక్కువ సేపు పనిచేయడమే నిబద్ధతకు చిహ్నంగా భావిస్తారని ఆమె వివరించింది. దీనికి తోడు, పై అధికారుల పట్ల నడుచుకోవాల్సిన తీరు, తప్పనిసరిగా హాజరుకావాల్సిన టీమ్ డిన్నర్లు వంటి అనేక ఒత్తిళ్లు ఉంటాయని పేర్కొంది.
దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అక్కడి కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే కఠినమైన సవాళ్లను వివరిస్తూ, ఉద్యోగం కోసం కొరియాకు రావద్దని ఆమె సూచించింది. స్వర్ణిమ్ సింగ్ అనే ఈ యువతి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంది.కొరియాలోని కంపెనీలలో పని గంటలు ముగిసినా, ఆలస్యంగా ఇంటికి వెళ్లాలనే నిబంధన ఉంటుందని స్వర్ణిమ్ తెలిపింది. అలా ఎక్కువ సేపు పనిచేయడమే నిబద్ధతకు చిహ్నంగా భావిస్తారని ఆమె వివరించింది. దీనికి తోడు, పై అధికారుల పట్ల నడుచుకోవాల్సిన తీరు, తప్పనిసరిగా హాజరుకావాల్సిన టీమ్ డిన్నర్లు వంటి అనేక ఒత్తిళ్లు ఉంటాయని పేర్కొంది. ఇలాంటి పార్టీలకు హాజరుకాకపోతే, వారిని సమస్యాత్మక వ్యక్తులుగా చూస్తారని ఆమె వెల్లడించింది."మీరు భారతీయులై ఉండి, కొరియాకు రావాలని అనుకుంటే, నేను చెప్పేది ఒక్కటే.. రావద్దు" అని ఆమె తన వీడియోలో స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం పోటీ పెరిగిపోవడం, ఉద్యోగావకాశాలు తగ్గడం, స్వల్పకాలిక కాంట్రాక్టులపై పనిచేసే విదేశీయులకు ఉద్యోగ సంతృప్తి లేకపోవడం వంటి కారణాలను ఆమె ప్రస్తావించింది. కొరియన్ డ్రామాలలో చూపించే ఆదర్శవంతమైన జీవితానికి, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు చాలా తేడా ఉంటుందని ఆమె హెచ్చరించింది.అయితే, అన్ని కార్యాలయాల్లోనూ ఇలాగే ఉండదని, కానీ చాలా కంపెనీలలో ఇది ఒక సాధారణ సాంస్కృతిక నియమమని ఆమె తన పోస్ట్ క్యాప్షన్‌లో తెలిపింది. ఈ వీడియోకు వేలాదిగా వ్యూస్, కామెంట్లు వస్తున్నాయి. చాలామంది ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కొరియాలో పనిచేయాలనే ఆలోచనను పునఃపరిశీలించుకుంటామని చెబుతున్నారు.