© 2026 nimisham.in

Anirudh Kavya Maran wedding: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి వివాహానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. అనిరుధ్, కావ్య మారన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట. అంతేకాదు, వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో గ్రీస్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10న వివాహం జరగనుందని, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారని కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అనిరుధ్, కావ్య మారన్ మధ్య రిలేషన్షిప్ ఉందంటూ గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారంతో పాటు, వీరి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై అనిరుధ్ లేదా కావ్య మారన్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇటీవల అనిరుధ్‌కు బంధువైన నటుడు, నాటక రచయిత వై.జీ. మహేంద్ర చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు
వచ్చాయి. అయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు ఆ అమ్మాయి కావ్య మారన్ అయి ఉండొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 తో పాటు విజయ్ జన నాయకన్, షారుఖ్ ఖాన్ కింగ్ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. మరోవైపు కావ్య మారన్ కూడా వ్యాపార రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా గుర్తింపు పొందిన ఆమె, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఐపీఎల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారినప్పటికీ, ఇది అధికారికంగా ధ్రువీకరించబడలేదు. ఇరు కుటుంబాల నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది.