© 2026 nimisham.in

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Irumudi Movie First Review: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ చిత్రంపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుడు శివ నిర్వాణ ఒక సరికొత్త అమ్మాయిల మిస్టరీ డెత్స్ కాన్సెప్ట్‌ను జోడించి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా మలిచారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ లభించింది. రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి ఈ చిత్రాన్ని నిర్మించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇందులో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రివ్యూ ప్రదర్శించగా, సినీ వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్టింగ్, ఆయనలోని అసలైన ఎనర్జీ ఈ చిత్రంలో పూర్తిగా కనిపిస్తాయని టాక్ వినిపిస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రవితేజ పాత్రలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. తొలిభాగంలో కుటుంబ కథాంశం, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, ఇక రెండో భాగంలో అసలు కథ ప్రారంభమై చివరి 25 నిమిషాలు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుందని తెలుస్తోంది. మొత్తానికి, విభిన్న
కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి, రవితేజకు బలమైన పునరాగమనాన్ని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరింత సమాచారం. అప్డేట్స్ కోసం అధికారిక సోషల్ మీడియా పేజీలను లేదా మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ఖాతాను సందర్శించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.