
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా (Mojtaba Khamenei) ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇరాన్ తిప్పి కొట్టింది. సుప్రీం లీడర్ వీడియోను ప్రభుత్వ మీడియా సంస్థ విడుల చేసింది (Iran Releases Video). అందులో మొజ్తబా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. ఎటువంటి గాయాలు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానీ కనిపించలేదు. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించకపోవడంతో అసలు ఆయన బతికే ఉన్నారా..?అనే ప్రశ్న వినిపిస్తోంది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇక ఆయన 90శాతం చనిపోయినట్లేననన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు. అంతకు ముందు జరిగిన ఆయన సతీమణి అంత్యక్రియల్లోనూ సుప్రీం లీడర్ కనిపించకపోవడం గమనార్హం. అయితే, భద్రతా కారణాల వల్ల ఆయన హాజరుకావడం లేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే మొజ్తబా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కరలేదని శుక్రవారం ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ క్రమంలోనే ఇరాన్ మొజ్తబా వీడియో విడుదల చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు