© 2026 nimisham.in

హార్ముజ్ జలసంధిపై తీవ్ర ఉద్రిక్తతలు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ అమెరికా నౌకలకు ప్రవేశం లేదు Strait Of Hormuz: ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait Of Hormuz)పై తమకు పూర్తి నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తమ నౌకా దిగ్బంధనం 'వాల్ ఆఫ్ స్టీల్' లాంటిదని, దీనిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి కేవలం ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ నిర్వహణ, పర్యవేక్షణలోనే ఉందంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళాల ప్రతినిధి హొస్సేన్ తాయెబ్ స్పష్టం చేశారు. Pralhad Joshi: రాహుల్ గాంధీ అహంకారం వల్లే.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు అమెరికా తప్పుగా అంచనా వేస్తోంది: అమెరికా వైఖరిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఘాటుగా స్పందించారు. అమెరికా తన నిఘా వైఫల్యాల కారణంగా అంతర్జాతీయ పరిస్థితులను, ఇరాన్ సత్తాను తీవ్రంగా తప్పుగా అంచనా వేస్తోందని ఆరోపించారు. హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ సర్కార్ అంతకంటే పెద్ద తప్పిదానికి పాల్పడుతోందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా వెళ్లే నౌకలపై ప్రత్యేకంగా టోల్ వ్యవస్థను కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశం లేదు: శాంతి సమయమైనా లేదా యుద్ధ సమయమైనా అమెరికా, ఇజ్రాయెల్ (జియోనిస్ట్) దేశాలకు చెందిన ఏ ఒక్క సైనిక లేదా చమురు నౌకను హార్ముజ్ జలసంధి గుండా అనుమతించబోమని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. మరోవైపు ఒమన్‌తో ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, తమ విస్తృత డిమాండ్లను అమెరికా నెరవేర్చే వరకు హార్ముజ్‌ను పూర్తిగా తెరవబోమని తేహ్రాన్ స్పష్టం చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు
మరింత తీవ్రస్థాయికి చేరాయి.