
ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 18న లాంచ్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ 2K రిజల్యూషన్ డిస్ప్లే, 6.83-అంగుళాల డిస్ప్లే iQOO Neo 11 Ultra : ఐక్యూ నుంచి ఖతర్నాక్ ఫోన్ వస్తోంది. 10,000mAh బ్యాటరీతో ఐక్యూ త్వరలో పవర్ఫుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఐక్యూ ఫోన్ నియో 11 సిరీస్‌లో రానుంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ముందే ధృవీకరించింది. ఇందులో అనేక ఫీచర్లను కూడా రివీల్ చేసింది. ఈ ఐక్యూ ఫోన్‌ను ఐక్యూ నియో 11 అల్ట్రాగా చెప్పొచ్చు. కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లైట్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఐక్యూ జెడ్11ఎస్ మోడల్ కూడా లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఆగస్టు 18నే లాంచ్ : ప్రస్తుతానికి చైనా మార్కెట్లో ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 2K రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుందని కంపెనీ ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ధృవీకరించింది. ఎఫ్2 లూమినెసెంట్ మెటీరియల్‌తో ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ కానుంది. అదనంగా, డిస్ప్లే టాప్ 2000 నిట్స్ వరకు బ్రైట్ నెస్ అందిస్తుంది. రాబోయే ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ ఫోన్‌తో పాటు, కంపెనీ ఐక్యూ జెడ్11ఎస్ కూడా రిలీజ్ చేస్తోంది. ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. Read Also : Vivo X300 FE Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో X300 FE ధర రూ.10 వేలు పెంపు.. ఐఫోన్ 17 కన్నా ఖరీదే! ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ ఇటీవలే చైనా టెలికాం సర్టిఫికేషన్