
Iqoo 16 Specs Leaked: త్వరలో మార్కెట్లోకి iQOO 16 స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది చాలా ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని వివరాలకు కూడా లీకయ్యాయి.. Iqoo 16 Specs Leaked: ప్రముఖ స్మార్ట్ఫోన్దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐకు త్వరలోనే మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని iQOO 16 పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ మొబైల్ అద్భుతమైన 2K రిజల్యూషన్ డిస్ప్లే తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. iQOO 16 మొబైల్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవల కొన్ని లీక్ చేశారు. దీని బట్టి చూస్తే... ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.85-అంగుళాల ఫ్లాట్ శాంసంగ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. iQOO 16 స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్సెట్తో పాటు అడ్రెనో 850 GPUతో పనిచేస్తుందని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది కొత్తగా డిజైన్ చేసిన రియర్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రోటోటైప్‌లో సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఇందులో X-యాక్సిస్ లీనియర్ మోటార్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు iQOO 16లో 8,500 mAh బ్యాటరీ ఉండే అవకాశాలున్నాయి.. సెక్యూరిటీ కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్