© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. iPhone Air 2 Leaks News Telugu: యాపిల్ సంస్థకు చెందిన ప్రతి ఫోన్‌పై ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా కంపెనీ తీసుకురాబోయే సరికొత్త స్లిమ్ మోడల్స్ గురించి ఎప్పుడు విపరీతమైన చర్చలు సోషల్ మీడియాలో సాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో, రాబోయే ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎయిర్ 2 (iPhone Air 2)కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు, డిజైన్ రెండర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మునుపటి మోడల్ కంటే ఎంతో ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్లతో ఇది అందుబాటులోకి రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ల్యావెండర్ కలర్లో ఐఫోన్.. ప్రముఖ యూట్యూబర్ జాన్ ప్రోసెర్ (John Prosser) లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఐఫోన్ ఎయిర్ 2 డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఈసారి యాపిల్ ఒక ప్రత్యేకమైన రంగును పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది స్పేస్ బ్లాక్ (Space Black), క్లౌడ్ వైట్ (Cloud White), లైట్ గోల్డ్ (Light Gold) రంగులతో పాటు సరికొత్తగా లావెండర్ (Lavender) కలర్ ఆప్షన్లో ఈ ఫోన్ లీక్ అయిన్నట్లు తెలస్తోంది. ఈ కొత్త కలర్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్.. కెమెరా విభాగంలో యాపిల్ ఈసారి పెద్ద మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందుబాటులోకి
తీసుకు రాబోతోంది.. ఇందులో కంపెనీ రెండు కెమెరాలను అందించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా.. దీనికి తోడుగా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను సెకండరీ కెమెరాగా ఇచ్చే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. దీనివల్ల ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు సంచారం.
అల్ట్రా స్లిమ్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్.. ఐఫోన్ ఎయిర్ 2 కేవలం డిజైన్ పరంగానే కాకుండా బిల్డ్ క్వాలిటీ పరంగానూ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం 5.6 మిమీ (mm) మందంతో అత్యంత స్లిమ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని బాడీని టైటానియం అలాయ్‌తో తయారు చేసే అవకాశం ఉంది. ఈ స్లిమ్ ఫోన్లో మరింత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం యాపిల్ తన సరికొత్త A20 ప్రో (A20 Pro) చిప్‌సెట్‌ను వినియోగించే అవకాశాలు ఉన్నాయి.
డైనమిక్ ఐలాండ్, ఫేస్ ఐడీ.. డిస్ప్లే పరంగా చూస్తే.. ఈ ఫోన్ బెజెల్స్ మునుపటి కంటే చాలా సన్నగా (Thin Bezels) ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ (Face ID) ఫీచర్‌తో రాబోతున్న ఈ ఫోన్లో స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ (Dynamic Island) పరిమాణాన్ని ఈసారి మరింత తగ్గించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రత్యేకంగా స్లిమ్ మోడల్స్‌ను మెయిన్ సిరీస్‌లోనే అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఈ ఐఫోన్ ఎయిర్ 2 మోడల్ 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కంపెనీ ఐఫోన్ 18ఇ (iPhone 18e)ని కూడా మార్కెట్లోకి తీసుకురావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.