
ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా నెలకు రూ.5,000 వంటి చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రయాణం ప్రారంభించే వారు, తమ కష్టార్జితాన్ని ఎక్కడ మదుపు చేయాలనే విషయంలో తరచూ తర్జనభర్జన పడుతుంటారు. వారికి ప్రధానంగా కనిపించే రెండు మార్గాలు... ఒకటి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లేదా రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), మరొకటి మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఈ రెండూ క్రమబద్ధమైన పొదుపుకు అద్భుతమైనవే అయినా, వాటి మధ్య రాబడి, రిస్క్, పన్నుల పరంగా స్పష్టమైన తేడాలు ఉన్నాయి.ఎఫ్డీ/ఆర్డీ: భద్రతే ప్రధానం మార్కెట్ ఒడిదొడుకులతో ఎలాంటి సంబంధం లేకుండా, పెట్టిన పెట్టుబడికి పూర్తి భద్రత, ముందుగా నిర్ణయించిన స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఎఫ్డీలు, ఆర్డీలు సరైనవి. ప్రస్తుతం బ్యాంకులు సుమారు 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. ఉదాహరణకు, నెలకు రూ. 5,000 చొప్పున 5 ఏళ్ల పాటు 7 శాతం వడ్డీతో ఆర్డీలో జమ చేస్తే, మీ పెట్టుబడి రూ. 3 లక్షలపై మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 3.6 లక్షలు చేతికి వస్తుంది. అయితే, దీనిపై వచ్చే వడ్డీకి మీ ఆదాయపన్ను శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని ఇవ్వడంలో ఇవి వెనుకబడతాయి.సిప్: సంపద సృష్టికి మార్గం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ‘సిప్’ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ ఆధారిత రాబడి లభిస్తుంది. ఇక్కడ "రూపీ కాస్ట్ యావరేజింగ్" (మార్కెట్ పడినప్పుడు ఎక్కువ