
Intinti Ramayanam September 14th Episode: పార్వతి, భానుమతిలకు తెలియకుండానే రాజేంద్ర ప్రసాద్‌కు అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు చేయించిన కుటుంబ సభ్యులు.. ఇక చివరగా అస్తికలను గంగలో కలిపేందుకు సిద్ధం అయ్యారు. కానీ ఇక్కడే పల్లవి ఓ అద్భుతమైన ప్లాన్ వేసి తన అత్తయ్య, అమ్మమ్మలకు నిజం తెలిసేలా చేయబోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కుటుంబం అంతా శ్రీరామ్ తల్లే చనిపోయిందని, ఆమెకే ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నామని నమ్మించగా.. నేరుగా ఆవిడే ఇంటికి వస్తుంది. దీంతో తీవ్రంగా షాక్ అయిన పార్వతి.. కొడుకులపై ఫైర్ అవుతుంది. బతికున్న ఆవిడ చనిపోయిందని ఎందుకు చెప్పారు, పిండం ఎవరికి పెట్టారంటూ కేకలు వేస్తుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?





