
టీమ్ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్ పడిక్కల్. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం. ఎక్కడ విఫలమయ్యాడో, ఎక్కడ విమర్శలు ఎదుర్కొన్నాడో.. అక్కడే సెంచరీ కొడితే ఎలా ఉంటుంది? ఈ ఫీలింగ్ గురించి మీకు తెలియాలి అంటే ఓసారి దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మనసులోని మాట తెలియాల్సిందే. రెండేళ్ల క్రితం భారత టెస్టు జట్టులోకి వచ్చి ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా ఆడిన పడిక్కల్ ఆశించిన ప్రదర్శన అయితే ఇవ్వలేకపోయాడు. వరుసగా 65, 0, 25 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో మళ్లీ జట్టులోకి రావడానికి సుమారు రెండున్నరేళ్లు పట్టింది. సాయి సుదర్శన్ గాయపడటంతో పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. రావడంతోనే సెంచరీ (131* - ప్రస్తుతానికి)తో శ్రీలంకపై విరుచుకుపడ్డాడు. నిజానికి అతని బ్యాటు సత్తా ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే లంకేయులకు తెలిసింది. ఇటీవల జరిగిన ఆ మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కేరళలోని మలప్పురం జిల్లా ఎడప్పాల్‌లో పుట్టిన దేవదత్ పడిక్కల్ తల్లిదండ్రులు బాబును కున్నత్, అంబిలి పడిక్కల్. కేరళలో జులై 7,2000లో పుట్టాడు. బిజినెస్ మ్యాన్ అయిన బాబును కున్నత్, దేవదత్ పడిక్కల్ చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ కొన్నాళ్లు ఉన్నాక.. కొడుకులోని క్రికెట్ ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించాలనుకున్నారు. దేవదత్‌కి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి మరింత శిక్షణ అవసరం అనిపించింది. దాంతో కర్ణాటక షిఫ్ట్ అయిపోయారు. అక్కడే దేవదత్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. ఇప్పటికే అదే రాష్ట్రానికి ఆడుతున్నాడు. ఆఖరికి ఐపీఎల్లో కూడానూ. శ్రీలంక బౌలర్లను ఈ రోజు డామినేట్ చేసిన పడిక్కల్.. స్కూల్ క్రికెట్లోనూ ఇదే పని చేశాడు. ఆర్మీ పబ్లిక్