
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో భారత సంతతి టీనేజర్‌పై హత్యాభియోగాలు నమోదయ్యాయి (Indian-Origin Teen). తల్లి, సోదరుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై బుధవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్‌లో ఈ హత్యలు జరిగాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్థ్ అరవింద్ (14)ను హత్య చేసిన ఆరోపణలపై అర్జున్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ గాలింపు జరిపిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం అర్జున్ ఇంటికి ట్యూటర్ రావడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. సుధా వెంకటేశన్‌ను సంప్రదించేందుకు ట్యూటర్ ప్రయత్నించగా వీలుకాలేదు. తర్వాత సుధా భర్తకు సమాచారం ఇవ్వగా.. ఆయన ప్రయత్నించినా ఇంట్లో ఎవరూ స్పందించలేదు. దాంతో ఆయన వెంటనే పోలీసులకు ఫోన్‌చేశారు. వారు వచ్చిచూడగా.. సుధ, సిద్ధార్థ్ విగతజీవులై కనిపించారు. ఇద్దరి శరీరాలపై గాయాలు ఉన్నాయని, పరీక్షల అనంతరం మరణాలకు స్పష్టమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. పోలీసులు వచ్చినప్పుడు అర్జున్ ఇంట్లో లేడు. తల్లి కారులో బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. అతడి కోసం రాత్రంతా గాలించి అరెస్టు చేశారు. అతడి ఆన్లైన్ యాక్టివిటీని ఆరాతీశారు. కుటుంబాన్ని చంపడం ఎలా అన్నదానిపై చాట్‌జీపీటీలో వెతికినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిపై హత్య అభియోగాలతో పాటు దాడి, కొట్టడం, వాహనాన్ని దొంగలించడం, అనుమతి లేకుండా వినియోగించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు