© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సుమారు 7.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.71 కోట్లు) భారీ మోసానికి పాల్పడిన కేసులో సునీల్ భారతి గోస్వామి (Goswami) అనే భారతీయుడు అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో నివసించే గోస్వామి ఈ స్కామ్లో ‘మనీ మ్యూల్’ పాత్ర పోషించినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుల ఆదేశాల ప్రకారం గోస్వామి.. వృద్ధుల దగ్గరకు వెళ్లి బెదిరించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆ ముఠాలోని ఇతర సభ్యులకు అందించేవాడని చెప్పారు. ‘‘గోస్వామి వృద్ధులకు ఫోన్ చేసి మేము పోలీసులం, ప్రభుత్వ అధికారులం అని పరిచయం చేసుకునేవాడు. వారిని వివిధ రకాలుగా భయపెట్టి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకునేవాడు. న్యూయార్క్, న్యూజెర్సీలలో తొమ్మిది మంది వృద్ధుల నుంచి సొమ్ము వసూలు చేశాడు’’ అని అధికారులు తెలిపారు. గోస్వామి 2025 ఆగస్టు నుంచి 2026 ఏప్రిల్ మధ్యకాలంలో తన బ్యాంకు ఖాతాలో 90 వేల డాలర్లకు పైగా నగదు జమ చేసినట్లు గుర్తించారు. ఆ ఖాతాపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అతనిపై పలు కేసులు నమోదు కాగా.. ఆగస్టు 17న అమెరికా కోర్టులో హాజరైన గోస్వామి, షరతులతో బెయిల్పై విడుదలైన మరుసటి రోజే కెనడా వెళ్లాడు. టొరంటో నుంచి దోహా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా అభ్యర్థనపై కెనడా అధికారులు ఆగస్టు 20న అతన్ని అరెస్టు చేశారు. ఈ నేరాలకు గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర
ప్రత్యుత్తరాలకి తావు లేదు.