
భారతీయ ఇళ్లలోని లివింగ్ రూమ్‌ల స్వరూపం నిశ్శబ్దంగా మారిపోతోంది. ఒకప్పుడు ఆడంబరానికి, వైభవ ప్రదర్శనకు కేంద్రంగా ఉన్న ఈ గదులు.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచులకు, ప్రశాంతమైన జీవనశైలికి అద్దం పడుతున్నాయి. పరిమాణం కంటే ప్రయోజనానికే ప్రాధాన్యం ఇస్తూ, 'తక్కువే ఎక్కువ' (less is more) అనే కొత్త సిద్ధాంతం ప్రాచుర్యం పొందుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో ఈ మారుతున్న ట్రెండ్‌ను విశ్లేషించింది.సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు, లివింగ్ రూమ్ అంటే అతిథులను ఆకట్టుకునే ఒక ప్రదర్శనశాల. భారీ సోఫా సెట్లు, పెద్దగా చెక్కిన సెంటర్ టేబుళ్లు, విశాలమైన ఖాళీ అంతస్తులు సంపదకు చిహ్నాలుగా ఉండేవి. గది ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప అనే భావన బలంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.మహిమా గ్రూప్ క్రియేటివ్ డైరెక్టర్ కీర్తి మదన్ ప్రకారం, లగ్జరీ అంటే కేవలం చదరపు అడుగులు లేదా ఖరీదైన ఫర్నిచర్ కాదు, ఆ స్థలాన్ని ఎంత ఆలోచనాత్మకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకున్నామన్నదే ముఖ్యం. లివింగ్ రూమ్‌లు కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, చదువుకోవడానికి, అప్పుడప్పుడు పనిచేసుకోవడానికి, ప్రశాంతంగా సేదతీరడానికి వీలుగా బహుళ ప్రయోజనకరమైన ప్రదేశాలుగా మారుతున్నాయి. "డిజైన్ అంటే కేవలం స్థలాన్ని వస్తువులతో నింపడం కాదు, ఆ స్థలానికి ఓ అర్థాన్ని ఇవ్వడం" అని ఆమె వివరించారు.ఈ కొత్త తరం డిజైన్‌లో సహజమైన మార్బుల్, చెక్క, నాణ్యమైన ఫ్యాబ్రిక్స్ వంటి మెటీరియల్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. శిల్పకళను పోలిన ఫర్నిచర్, వెచ్చదనాన్ని పంచే లైటింగ్, ఖాళీగా వదిలేసిన