
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ (New York tri-state) ప్రాంతంలో భారత 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు (Guinness World Record) నమోదైంది. న్యూజెర్సీలోని పార్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో 1300కు పైగా అమెరికా జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య అమర్చి ‘‘250’’ ఆకారాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ‘‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’’ (Largest Flagpole Number)గా గిన్నిస్ రికార్డు లభించింది. భారత 80వ స్వాతంత్ర్య వేడుకలు, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) సంయుక్తంగా నిర్వహించాయి. భారతీయ సంతతికి చెందిన పలువురు ప్రతినిధులు, వ్యాపార, సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను వక్తలు కొనియాడారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు