© 2026 nimisham.in
'రాత్రి వర్క్ చేస్తావా.. వచ్చి కారెక్కు'.. కొరియాలో భారతీయ విద్యార్థినికి చేదు అనుభవం సౌత్ కొరియాలో ఓ ఇండియన్ అమ్మాయి తన యూనివర్సిటీకి వెళ్తుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. సుమారు 70 ఏళ్లు పైబడిన ఒక కొరియన్ వృద్ధుడు కారు ఆపి, దారి అడిగే నెపంతో ఆమెను వేధించాడు. రెస్టారెంట్ ఎక్కడుందో చూపించమంటూ తన కారు ఎక్కాలని ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా, యూనివర్సిటీ కాకుండా బయట నైట్ టైమ్ వర్క్ చేసే ఆలోచన లేదా అంటూ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆ అమ్మాయి తీవ్ర భయాందోళనకు గురైంది. విదేశాల్లో ఒంటరిగా ఉండే భారతీయ విద్యార్థినులు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇలాంటి మనుషుల నుండి ఎలా అలర్ట్గా ఉండాలో ఈ వీడియో ద్వారా ఆమె వివరించింది. ఈ వార్తకు సంబంధించిన