
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ రేస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తం 27 టెస్ట్ సిరీస్లలో ఇంకా 15 సిరీస్లు మిగిలి ఉన్నాయి. 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్లోని 'ద ఓవల్' లో జరగనున్న టైటిల్ పోరుపైనే అన్ని జట్లు కన్నేశాయి. గత రెండు సైకిళ్ల లెక్కలు చూస్తే, ఏ జట్టు అయినా ఫైనల్ చేరాలంటే కనీసం 60% నుంచి 65% పాయింట్ల శాతం సాధించాల్సి ఉంటుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో కాస్త మెరుగైంది. గత ఏడాది సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవడంతో భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత్ దాదాపు అవుట్ అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మళ్లీ అవకాశం దక్కింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత భారత్ పీసీటీలు పెగిగింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడింది. అందులో 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో రెండు, ఇంగ్లాండ్ చేతిలో రెండు మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్తో జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్కు ప్రస్తుతం శ్రీలంకతో ఆడాల్సిన రెండో టెస్టుతో కలిపి మొత్తం 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఫైనల్ చేరేందుకు కావాల్సిన 60% PCT