
వార్మప్ మ్యాచ్ విజయంతో అసలైన పరీక్షకు టీమ్ఇండియా సిద్ధమైంది. ‘స్పిన్’ ఎటాక్‌తో దెబ్బ కొట్టాలనే ఆతిథ్య జట్టు సవాల్‌కు టీమ్ఇండియా (Team India in SriLanka) ఎదురు నిలుస్తుందా? మరో ఐదు రోజుల్లోనే ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి సరిచేసుకోవాల్సిన లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ‘తొలి రోజు నుంచే శ్రీలంక సవాళ్లకు సమాధానం ఇస్తాం’.. ఇవీ భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు. అందుకు తగినట్టుగానే వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం కూడా సాధించింది. ఆఖర్లో మహ్మద్ సిరాజ్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదేశాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో భిన్నమైన పరిస్థితులను సృష్టించుకొని మరీ భారత జట్టు గెలిచింది. వేలి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటాడు. వచ్చే శనివారం నుంచే శ్రీలంక-భారత్ (India vs Sri lanka) జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై లంక జట్టును అడ్డుకోవడం తేలికేం కాదు. గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ, అతడు జాతీయ జట్టుకు ఆడి చాన్నాళ్లవుతోంది. నేరుగా మూడో స్థానంలో ఆడించే అవకాశం లేదు. కానీ, తనదైన ఆటతో ‘నేనున్నానంటూ’ ముందుకొచ్చాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal). వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో ఆడగలనని నిరూపించాడు. నిలకడ, దూకుడు, సమయోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్నాటికి ఫామ్ అందుకొన్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 207 పరుగుల లక్ష్య ఛేదనకు దిగినప్పుడు పునాదిని బలంగా వేసింది యశస్వినే. తనదైన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రీలంక స్పిన్నర్లను సమర్థవంతంగానే ఎదుర్కొని భారత బ్యాటర్లు పరుగులు రాబట్టారు. దాదాపు పది నెలల నుంచి టెస్టు మ్యాచ్ బరిలోకి