
శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక క్రికెట్ ఎలవెన్ (SLC XI)తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో మన బ్యాటర్లు దుమ్మురేపారు. రెండో రోజు ఆటలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పవర్ ఏంటో చూపించారు. ఓవైపు దేవ్ దత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో మెరిస్తే, మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అందరి దృష్టిని మాత్రం ఆఖర్లో వచ్చిన ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఆకర్షించాడు. ఆ సిక్సర్ల వర్షం చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఫిదా అయిపోయాడు. ఈ మ్యాచ్‌లో అసలైన మజా ఆఖరి ఓవర్లోనే కనిపించింది. శ్రీలంక స్పిన్నర్ దిలుమ్ సుదీరా వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికి పడిక్కల్ సింగిల్ తీసి గుర్నూర్ బ్రార్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత బరార్ మామూలు రచ్చ చేయలేదు. రెండో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతికి స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ట్రై చేసినా రన్ రాలేదు. కానీ ఐదో బంతిని మళ్లీ మిడ్‌వికెట్ స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇక చివరి బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్‌గా మలచడంతో ఆ ఓవర్లో ఏకంగా 25 రన్స్ వచ్చాయి. గుర్నూర్ బ్రార్ బ్యాటింగ్ విన్యాసాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యపోయి చప్పట్లు కొడుతూ అభినందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గుర్నూర్ బ్రార్ కేవలం 18 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు ఆటలో టీమిండియా 90 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దేవ్ దత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. గాయం