
దేశ రక్షణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీరప్రాంత రక్షణ.. ప్రత్యేకించి హిందూ మహాసముద్రంపై నిఘాను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీ జనరల్ అటామిక్స్‌తో రూ. 1,943 కోట్ల విలువైన డీల్ కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నౌకాదళం కోసం రెండు అత్యాధునిక ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్లను లీజుకు తీసుకోనున్నారు.సముద్ర తీరంలో వ్యూహాత్మక భద్రతకు ప్రాముఖ్యత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లీజ్ కాంట్రాక్ట్ కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ మహాసముద్ర పరిధిలో పెరుగుతున్న ఇతర దేశాల వ్యూహాత్మక కదలికలను గమనించడం, సరిహద్దులపై నిరంతర నిఘా ఉంచడం ఈ డ్రోన్ల ద్వారా సులభతరమౌతుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లతో కూడిన ఈ డ్రోన్లు.. దేశ నౌకాదళ నిఘా సామర్థ్యానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. హిందూ మహాసముద్ర రీజియన్ లో దేశ రక్షణను పటిష్టం చేయడం, చొరబాట్లను నిరోధించడానికి ఈ డ్రోన్లు సహాయపడతాయని తెలిపింది.ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్లకు అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ ఉంది. ఆకాశంలో చాలా ఎత్తున వరకు ఎగరగలగడం, సుదీర్ఘ కాలం పాటు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. ఈ డ్రోన్లు నిరంతరాయంగా 30 గంటలకు పైగా గాల్లోనే ఉంటూ డేగకన్ను వేయగలవు. సముద్రమట్టానికి సుమారు 40,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూర సరిహద్దు ప్రాంతాలను సైతం పరిశీలించగలవు. శత్రువుల జలాంతర్గాములను పసిగట్టే అత్యాధునిక యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ మిషన్ కిట్‌ను కూడా వీటికి జత చేసే వెసలుబాటు ఉంది.తిరుమలలో గదుల దళారీ ముఠా నెట్ వర్క్: కింగ్ పిన్ గుర్తింపు: ఒక్కో రూమ్ పైప్రస్తుతం కుదుర్చుకున్న ఈ లీజ్ ఒప్పందం.. భవిష్యత్తులో కేంద్రం కొనుగోలు చేయబోయే భారీ డ్రోన్ల డీల్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా సాగుతుంది. మెరికా ప్రభుత్వం నుంచి సుమారు మూడు బిలియన్