
శ్రీలంకతో గాలే స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సిరీస్‌లో భాగంగా శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో యువ ఎడమచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్లో తన తొలి సెంచరీ సాధించిన పడిక్కల్, లంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వర్షం ఆటంకం కలిగించినప్పటికీ, రోజు ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 288 పరుగుల భారీ స్కోరు సాధించింది. పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, రిషభ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శ్రీలంక తరఫున కేశర నువంతకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ (32) వేగంగా ఫోర్లు కొడుతూ మంచి ఊపుమీద కనిపించాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్‌ను డీకొనడంతో కన్ఫ్యూజన్ ఏర్పడి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి లంక బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 77 పరుగులు చేసి మంచి ఫామ్‌లో కనిపించినా, చేతి కండరాల నొప్పితో టీ విరామం తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కెప్టెన్ గిల్ (16) కొద్దిసేపు అలరించినా ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ అద్భుత సెంచరీతో దేవదత్ పడిక్కల్ భారత క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 21వ శతాబ్దంలో భారత్ తరఫున నంబర్ 3