© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. IND vs ENG Highlights: టీ20 ప్రపంచకప్ గెలుపొందిన అనంతరం భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న టీమిండియా.. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. రెండో మ్యాచ్‌లో ఏమాత్రం పోటీనివ్వకుండా భారత జట్టు మ్యాచ్‌ను చేజార్చుకుంది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49) సాధించి రాణించగా.. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 43 పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24) పర్వాలేదనిపించగా.. తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ నిరాశపర్చాడు. 10 బంతులు ఆడి 14 పరుగులకే ఐపీఎల్ హీరో వెనుదిరిగాడు. శివం దూబే (5) కూడా తక్కువ స్కోర్‌కు పరిమితమయ్యాడు. ఇక బౌలింగ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అదరగొట్టారు. సామ్ కుర్రాన్ మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, డాసన్ తలా ఒక్కో వికెట్ సాధించారు. ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి
191 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపొందింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించారు. జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో చివరి దాకా గ్రౌండ్లో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక హ్యారీ బ్రూక్ (39), టామ్ బాంటన్ (39) మోస్తరు స్కోర్‌తో రాణించారు. అయితే ఆరంభంలో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరూ డకౌట్ కావడంతో ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఈ సమయంలో బెతెల్, హ్యారీ బ్రూక్ అద్భుతంగా ఆడారు. భారత బౌలర్లను ఈ కుర్రాడు బెంబేలెత్తించాడు. అర్ష్‌దీప్ సింగ్ 40 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.
ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోను ఓటమి పాలై పరువు మూటగట్టుకుంది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో తన ప్రత్యర్థిగా ఉన్న భారతదేశంపై ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒకటి రద్దవగా.. రెండో మ్యాచ్ ఓటమిపాలవడంతో ఇంగ్లండ్ కన్నా భారత జట్టు సామర్థ్యం తేలిపోయింది. 1-0తో ఐదు టీ20 సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ పైచేయి సాధించింది.