
ఇంటర్నెట్ డెస్క్: జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా.. ఇదీ గాయాలతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాట పట్టిన భారత క్రికెటర్లు. ఇంజూరీ మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సీవోఈపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిజియోలు ఇలా వార్తల్లో నిలవడం బాధాకరమని తెలిపారు. అలాగే ప్లేయర్ల ట్రైనింగ్ రొటీన్స్ను మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కి మోకాలి గాయం ఉంది. మిగతా ప్లేయర్లలో చాలా మందిలో కండరాలు పట్టేయడం చూస్తున్నాం. వారికి ఇస్తున్న ట్రైనింగ్‌లో ఏదో పొరపాటు ఉందనిపిస్తోంది. అందుకే పదేపదే గాయాలు తిరగబెడుతున్నాయి. భారత్ జట్టుకు ఆడుతున్నప్పుడే గాయపడుతున్నారు. దురదృష్టవశాత్తూ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) ఫిజియోలను బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మరీ ముఖ్యంగా బయోమెకానిక్స్ పేరుతో నెట్స్‌లో బౌలర్లను పరిమిత సంఖ్యలోనే బంతులు వేయాలనే విధానం సందేహాస్పదంగా మారింది. ఐపీఎల్‌లోనూ కొందరు విదేశీ ఫిజియోలు నెట్స్‌లో 20 బంతులు కంటే ఎక్కువ వేయనివ్వకుండా చూస్తారని తెలిసింది. టీ20ల్లో బౌలర్ కనీసం 24 బంతులు విసరాలి. కానీ, నెట్స్‌లో అంతకంటే తక్కువ బంతులు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం ప్రయోజనం?’’ అని గావస్కర్ ప్రశ్నించారు. ‘‘గాయాలు ఎందుకు పునరావృతం అవుతున్నాయనేది తెలుసుకోవాలి. అందుకు పరిష్కారం కనుగొనాలి. జిమ్ ఫిట్నెస్ కంటే మ్యాచ్ ఫిట్నెస్ ముఖ్యం. అయితే, నేను ఫిట్నెస్ విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్న తరానికి చెందినవాడిని కావచ్చు కానీ.. మ్యాచ్ ముఖ్యమని భావిస్తా’’ అని సునీల్ గావస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆటగాళ్ల గాయాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫిజియోల నుంచి బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వివరణ అడిగారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు